ఈతరం భారతం హైద్రాబాద్ జూన్ 4:
మహాలక్ష్మి పథకం జీరో టికెట్ అంశంలో ఉద్యోగాలు కోల్పోయిన కండక్టర్‌లను మానవతా దృక్పధం తో తిరిగి ఉద్యోగాలలోకి తీసుకోవాలనిటిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులుబక్కని నర్సింహులు డిమాండ్ చేశారు.గురువారం ఎన్‌టిఆర్ భవన్‌లో తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ టీఎన్‌టీయూసీ (తెలుగునాడు ట్రేడ్‌యూనియన్ కౌన్సిల్)` టీఎన్‌టీయూసీకి అనుబంధ సంస్థ ‘టీజీఆర్‌టీసీ కార్మికపరిషత్’ లో ఆర్‌టీసీ కార్మికులు చేరడం జరిగింది. ఈ సందర్భంగా పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు తెలుగుదేశం పార్టీ కండువాను కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పొలిట్‌బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు మాట్లాడుతూ… ఆసియాలోనే అత్యద్భుతంగా హైదరాబాద్‌లోని ఎంజీబిఎస్ ఆర్‌టీసీ బస్టాండ్‌ను ఎన్‌టిఆర్ నిర్మించారు. హైదరాబాద్‌లోని ఆర్‌టీసీ క్రాస్‌రోడ్‌లో ఉన్న ఆర్‌టీసీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అయిన బస్‌భవన్‌ను అత్యంత ఆధునిక సౌకర్యాలతో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి హయాంలో నిర్మించారు. ఆర్‌టీసీలో కండక్టర్‌లుగా మొట్టమొదటిసారిగా మహిళలకు చంద్రబాబు గారు అవకాశం కల్పించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఆర్‌టీసీలో నియామకాలు జరిపి, ప్రమోషన్‌లు కల్పించి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రావాల్సిన అన్ని బకాయిలను సకాలంలో చెల్లించేవారు. ప్రస్తుత ఆర్‌టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నియమించాలి. అలాగే ప్రమోషన్‌లను కూడా కల్పించాలి. మహాలక్ష్మి పథకంలో భాగంగా జీరో టికెట్ అంశంలో ఉద్యోగాలు కోల్పోయిన (రిమువల్) కండక్టర్‌లను మానవతా దృక్పథంతో తిరిగి వారిని ఉద్యోగాలలోకి తీసుకోవాలి. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఆజ్మీరా రాజునాయక్, సూర్యదేవర లత, ఎబిఆర్ మోహన్‌రావు, జగదీష్, ఎం. శ్రీధర్, పి. వెంకటేష్, పి. శంకర్ తదితరులు పాల్గొన్నారు.














