ఈతరం భారతం హైద్రాబాద్ జూన్4 :
ఎయిర్‌పోర్టులో విదేశీ ప్రయాణికుడికి ఎబోలా వైరస్ హిస్టరీ ఉన్నట్లు గుర్తించారు. సూడాన్ దేశానికి చెందిన మహమ్మద్ అనే ప్రయాణికుడు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్క్రీనింగ్‌లో ఈ ప్రయాణికుడికి గతంలో ఎబోలా వైరస్ హిస్టరీ ఉన్నట్లు గుర్తించారు. ఎబోలా లక్షణాలు ఉండటంతో అధికారులు ఆ వ్యక్తిని గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్‌కు తరలించారు. శాంపిల్స్ సేకరించి సీసీఎంబీ పంపించినట్లు గాంధీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.














