ఈతరం భారతం న్యూఢిల్లీ జూన్ 12
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ సరఫరాపై తాత్కాలిక నియంత్రణలు విధిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఒక్క వాహనానికి రోజుకు 200 లీటర్లకు మించి డీజిల్ ఇవ్వొద్దు.డీజిల్‌ను తిరిగి విక్రయించడం నిషేధం.వాహన ట్యాంకులు లేదా అనుమతించిన కంటైనర్లలో మాత్రమే ఇంధనం పోయాలి.పెద్ద పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు రిటైల్ బంకుల నుంచి ఇంధనం తీసుకోరాదు.ఈ నిబంధనలు ప్రాథమికంగా 90 రోజుల పాటు అమల్లో ఉంటాయి,హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్, డైవర్షన్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు నిఘా పెట్టాలని కేంద్రం ఆదేశించింది.
…..
రోజుకు 200 లీటర్లకు మించి డీజిల్ ఇవ్వొద్దు అంటే వ్యవసాయ పనులకు ట్రాక్టర్లు జోరుగా నడిచే సమయం ఇది, ఇలాంటప్పుడు ఇలాంటి ఆంక్షలు పెడితే మళ్ళీ రైతులకే కదా ఇబ్బంది? కిమ్ కర్తవ్యమ్…















