ఈతరం భారతం న్యూఢిల్లీ జూన్ 12
V2V – Vehicle to Vehicle కమ్యూనికేషన్ టెక్నాలజీ కేంద్ర ప్రభుత్వం త్వరలో తప్పనిసరి చేయబోతోంది.ఇదిఎలా పని చేస్తుంది అంటే కార్లు, ట్రక్కులు, బైక్‌లు పరస్పరం సిగ్నల్స్ ద్వారా “మాట్లాడుకుంటాయి”. ఒకదాని స్పీడ్, లొకేషన్, బ్రేకింగ్ వివరాలు మరొకదానికి వెంటనే తెలుస్తాయి.
ఎందుకు తప్పనిసరి ?
రోడ్లు విస్తరిస్తున్నా, వేగ నియంత్రణ చేస్తున్నా ప్రమాదాలు తగ్గడం లేదు. రోజూ ఎక్కడో ఒక చోట ప్రాణాలు పోతున్నాయి. V2V వాహనాలు ఢీకొనే ముందే డ్రైవర్‌కి వార్నింగ్ వస్తుంది. దీనితో ప్రమాదాలు తగ్గుతాయి.ట్రాఫిక్ ఫ్లో మెరుగుపడుతుంది.ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఆటోమేటిక్ అవుతుంది.















