EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

త్వరలో వాహనాలూ మాట్లాడుకుంటాయ్

ఈతరం భారతం న్యూఢిల్లీ జూన్ 12

V2V – Vehicle to Vehicle కమ్యూనికేషన్  టెక్నాలజీ కేంద్ర ప్రభుత్వం త్వరలో తప్పనిసరి చేయబోతోంది.ఇదిఎలా పని చేస్తుంది అంటే కార్లు, ట్రక్కులు, బైక్‌లు పరస్పరం సిగ్నల్స్ ద్వారా “మాట్లాడుకుంటాయి”. ఒకదాని స్పీడ్, లొకేషన్, బ్రేకింగ్ వివరాలు మరొకదానికి వెంటనే తెలుస్తాయి.

ఎందుకు తప్పనిసరి ?

రోడ్లు విస్తరిస్తున్నా, వేగ నియంత్రణ చేస్తున్నా ప్రమాదాలు తగ్గడం లేదు. రోజూ ఎక్కడో ఒక చోట ప్రాణాలు పోతున్నాయి. V2V  వాహనాలు ఢీకొనే ముందే డ్రైవర్‌కి వార్నింగ్ వస్తుంది. దీనితో ప్రమాదాలు తగ్గుతాయి.ట్రాఫిక్ ఫ్లో మెరుగుపడుతుంది.ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఆటోమేటిక్ అవుతుంది.

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top