ఈతరం భారతం ములుగు జూన్ 17
పదవ తరగతి పరీక్ష ఫలితాలలో రాష్ట్రంలో తెలుగు జిల్లా మొదటి స్థానంలో నిలిచినట్లే, యువతీ యువకులు ఉద్యోగాలలో మొదటి స్థానంలో నిలవాలని మంత్రి సీతక్క అన్నారు. ఉద్యోగ అవకాశాలు లభించని యువత తమ ప్రతిభను పెంపొందించుకొని ఉద్యోగ అవకాశాలు పొందాలన్నారు. బుధవారం ములుగు మండలం ఇంచర్ల గ్రామంలో ఎంఆర్ ఫంక్షన్ హాల్ నిర్వహించిన మెగా జాబ్ మేళా-2026లో ఉద్యోగ అవకాశాలు పొందిన జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావుతో కలిసి మంత్రి సీతక్క యువత నియామక పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీతక్క మాట్లాడుతూ యువత దేనిలోనైనా రాణించవచ్చని, ఇలాంటి మెగా జాబ్ మేళా కార్యక్రమాలను రానున్న రోజులలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు ఉద్యోగాలలో యువత చేరి ఉపాధి పొందాలని, ఉద్యోగం ఎక్కడ వస్తే అక్కడే విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ తోప్పో, రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు, ఏటూరు నాగారం ఎస్పీ మనన్ భట్, పంచాయితీ రాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఇంచర్ల సర్పంచ్ కుమార్ గౌడ్, మున్సిపాలిటీల చైర్మన్‌లు, ఉద్యోగులకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.















