ఈతరం భారతం బాసర జూన్ 17 :
శ్రీ వాగ్దేవి సంస్కృత భారతి ఆధ్వర్యంలో బాసర క్షేత్రంలోని జ్ఞాన సరస్వతి దేవాలయ సమీపంలో గల శివయోగి నిర్మల అంబయ్య సిద్ధాంతి సిద్ధాశ్రమ ము కోటి పార్థివశివలింగ శ్రీ మేధా దక్షిణామూర్తి సహిత ద్వాదశ జ్యోతిర్లింగమందిర మాసోత్సవం సందర్భంగా 21న ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించ నున్నారు. ముందుగా దీపారాధన, కలశ స్థాపన ,విఘ్నెశ్వరశ్వర పూజ ,కోటి పార్థివ లింగ , శ్రీ మేధా దక్షిణామూర్తి సహిత ద్వాదశ జ్యోతిర్లింగములకు మహా రుద్రాభిషేకం పుష్పార్చన , బిల్వార్చన , గోపూజ ,గణపతి, నవగ్రహ, రుద్రహోమములు, భూదాన సంకల్ప పూజ, మహా అన్నదానమునిర్వహించనున్నారు.సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా భువనగరి వాస్తవ్యులు ప్రముఖ నాట్య కళాకారిణి సిరి కూచిపూడి నృత్య నిలయం వ్యవస్థాపక అధ్యక్షులు నాట్య గురువులు శ్రీ అనూష గణేష్ శిష్య బృందముచే నృత్య ప్రదర్శన మరియు అష్టావధాన కార్యక్రమం నిర్వహించినట్లు వ్యవస్థాపక అధ్యక్షులు శివశ్రీ నిర్మల అంబికానాధ శర్మ తెలిపారు.ఆసక్తిలవారు 99483 32032 సంప్రదించాలని నిర్వాహకులు ,వ్యవస్థాపక అధ్యక్షులు శివశ్రీ నిర్మల అంబికానాధశర్మ సంధ్య దంపతులు కోరారు.















