ఈతరం భారతం హైద్రాబాద్ జూన్ 20 ;
కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఫరేడ్ గ్రౌండ్లో 1డే కౌంట్ డౌన్ ఈవేంట్ లో భాగంగా యోగ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శూక్ల , భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హాజరయ్యారు.కేంద్ర బొగ్గు గనుల, శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ లతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొని ఆసనాలు వేశారు.
విశేష స్పందన.. తరలివచ్చిన యువత
ఈ యోగా మహోత్సవానికి నగర నలుమూలల నుండి యువతీ యువకులు, విద్యార్థులు, మహిళలు మరియు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వేదిక ప్రాంగణమంతా యోగా సాధకులతో కిక్కిరిసిపోయింది.















