ఈతరం భారతం హైద్రాబాద్ జూన్ 20:
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సికింద్రాబాద్ జిల్లా ప్యారడైజ్ నగర శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగ దినోత్సవం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాలప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ మాట్లాడుతూ ఈ రోజు మనం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదు, మన శారీరక,మానసిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని మెరుగుపరచే ఒక గొప్ప జీవన విధానం.
ప్రతిరోజూ యోగా చేయడం వల్ల శరీరం దృఢంగా,మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. విద్యార్థులు యోగా చేయడం ద్వారా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. నేటి ఒత్తిడితో కూడిన జీవితంలో యోగా మనకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అందిస్తుంది.
యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన బహుమతి అన్నారు.
ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి గోకుల్,నగర సంఘటన కార్యదర్శి హరీష్ సాగర్, కార్యకర్తలు పీజీ కాలేజ్ ప్రెసిడెంట్ అభినయ్, టౌన్ SFS కన్వీనర్ కౌశిక్ నవీన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు…..















