ఈతరం భారతం హైద్రాబాద్ జూన్ 20:
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్బంగా డెక్కన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌లోని జీ మీడియాకార్యాలయంలో ఆరోగ్య శిబిరం, రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య పరీక్షలుచేయించుకోవడంతో పాటు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కంటి పరీక్షలు, దంత పరీక్షలు, సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సొసైటీ ఎగ్జిగ్యుటీ మెంబర్ జి.మాధవి మాట్లాడుతూ, రక్తదానం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఆరోగ్యవంతుడు క్రమం తప్పకుండా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. సమాజ సేవలో భాగంగా ఇలాంటి ఆరోగ్య మరియు రక్తదాన శిబిరాలను భవిష్యత్తులో మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జీ మీడియా యాజమాన్యం, ఉద్యోగులు, వైద్య బృందం, రక్తదాతలు మరియు వాలంటీర్లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.















