ఈతరంభారతం ఓవర్సీస్ న్యూస్ జూన్ 20
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లో శనివారం జరిగిన జంట పేలుళ్లలో ఏడుగురు మరణించగా, ముగ్గురు గాయపడ్డారు. బన్నూ జిల్లాలోని మార్కా బేరా ప్రాంతంలో రోడ్డుపక్కన అమర్చిన ఐఈడీ పేలడంతో ప్రయాణికుల వ్యాన్‌లో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. క్షతగాత్రులకు సాయం చేసేందుకు వచ్చిన సమయంలో అదే ప్రాంతంలో మరో పేలుడు సంభవించి ఇద్దరు మరణించారు. రెండో పేలుడులో రెస్క్యూ వాహనం కూడా ధ్వంసమైంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా, ఇప్పటివరకు ఏ ఉగ్రసంస్థ బాధ్యత వహించలేదు.















