ఈతరం భారతం న్యూఢిల్లీ జూన్ 26
దేశంలో నకిలీ మందుల అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్లు, క్యాన్సర్ మందులు, యాంటీమైక్రోబియల్స్, నార్కోటిక్ ఔషధాల ప్యాకేజింగ్పై క్యూఆర్ కోడ్ లేదా బార్ కోడ్ తప్పనిసరి చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మందుల తయారీ వివరాలను సులభంగా ట్రాక్ చేయవచ్చు. వ్యాక్సిన్లు, క్యాన్సర్ మందులకు 2027 జూలై 1 నుంచి, యాంటీమైక్రోబియల్స్ కు 2028 జూలై 1 నుంచి నిబంధనలు అమల్లోకి వస్తాయి.













