EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

నూతన అవుట్‌డోర్ అడ్వర్టైజింగ్ పాలసీ జి.ఓ. నెం. 173 విడుదల పట్ల టొమో హర్షం

ఈతరం భారతం హైదరాబాద్ జూన్ 25:

హైదరాబాద్ అర్బన్ రీజియన్‌కు నూతన అవుట్‌డోర్ అడ్వర్టైజింగ్ పాలసీ (జి.ఓ. నెం. 173)ను తెలంగాణ అవుట్‌డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్(టొమో) స్వాగతించింది. ఈ సందర్బంగా సోమజి గూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో తెలంగాణ అవుట్‌డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ (TOMO) అధ్యక్షుడు సయ్యద్ ఇఫ్తేఖార్ మెహ్దీ మాట్లాడుతూ, “హైదరాబాద్ అర్బన్ రీజియన్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జి.ఓ. నెం. 173 ద్వారా ప్రవేశపెట్టిన నూతన అవుట్‌డోర్ అడ్వర్టైజింగ్ పాలసీని TOMO హర్షాతిరేకంతో స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ పాలసీ అవుట్‌డోర్ ప్రకటనల రంగంలో పారదర్శకత, భద్రత, బాధ్యతాయుత నిర్వహణ మరియు క్రమబద్ధమైన నియంత్రణకు ఒక కీలక ముందడుగు” అని అన్నారు.అనంతరం

TOMO ప్రధాన కార్యదర్శి కె. రమేష్ మాట్లాడుతూ, “పట్టణ ప్రకటనల రంగాన్ని క్రమబద్ధీకరిస్తూ ఆర్థికాభివృద్ధికి తోడ్పడటంతో పాటు ప్రజల భద్రత, నగర సౌందర్యాన్ని పరిరక్షించే దిశగా కృషి చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి  ఏ. రేవంత్ రెడ్డికి మా సంఘంహృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది అలాగే ఈ సమగ్ర మార్గదర్శకాలను రూపొందించి అమలు చేయడంలో కృషి చేసిన GHMC, సైబరాబాద్ మరియు మల్కాజ్‌గిరి సంబంధిత అధికారుల సేవలను కూడా అభినందిస్తున్నాము” అనితెలిపారు.సమావేశానంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

Related News

Select the Topic
Scroll to Top