ఈతరం భారతం హైద్రాబాద్ జూన్ 25 ;
రవీంద్రభారతిలో ఈనెల 27న శనివారం ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 1గం. వరకు నిర్వహిస్తున్నట్లు శ్రీమానస ఆర్ట్ థియేటర్స్ సస్థ అధ్యక్షులు బి.రామచంద్ర రావు తె లిపారు.అష్టోత్తర శత వైణిక నాద యజ్ఞం-నిర్వహించనున్నారు. ముఖ్యఅతిథిగా డా.కేవీ రమణాచారి రిటైర్డ్ ఐఏఎస్ హాజరవుతున్నారు. ప్రముఖ సాహితీవేత్త డా.పి. లలిత వాణి సభాధ్యక్షత వహిస్తారు. లహరిశ్రీ నృత్యనికేతన్ వ్యవస్థాపకురాలు డా. ఝాన్సీరామ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డు అధినేత బింగి నరేందర్ గౌడ్, ఆధ్యాత్మికవేత్త మీనాక్షి శ్రీనివాస్-అతిథులుగా హాజరవుతున్నారు. బి.రామచంద్రరావు(అధ్యక్షులు), రఘుశ్రీ(ఉమ్మడిసింగు రాఘవరావు, కార్యదర్శి), దివ్యసాయి వీణా అకాడమీ -పి.వరప్రసాద్ అధ్యక్షులు, డా. కళ్యాణి హేమలత వ్యవస్థాపకులు ఈ వేడుకల వివరాలను ఓ పత్రికాప్రకటనలో తెలిపారు. శ్రీమానస ఆర్ట్ థియేటర్స్, దివ్యసాయి వీణా అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు















