EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

అమరుల త్యాగాల పునాదులపై అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ : కాంగ్రెస్ సీనియర్ నేత ఇందిరాశోభన్

ఈతరం భారతం హైద్రాబాద్ జులై 2 :

అమరుల త్యాగాల పునాదులపై అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ తెలంగాణలో ఆధిపత్యం చెలాయించింది కల్వకుంట్ల కుటుంబం కాదా.?అని కాంగ్రెస్ సీనియర్ నేత ఇందిరాశోభన్ ప్రశ్నించారు.నేడు BRS పేరు మీద కేటీఆర్, హరీష్ రావు.. TRS పేరుతో కవిత రాజకీయ డ్రామాలాడుతున్నారని ఆమె విమర్శించారు

నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి.. రాజకీయ ఉద్యోగాలు కేవలం ఒక్క ఫ్యామిలీకే దక్కడం వాస్తవం కాదా.?అని అన్నారు.మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి.. తమ ఆస్తులు పెంచుకున్న చరిత్ర వాళ్ళది దుయ్యబట్టారు. వాళ్ల దోపిడీని కప్పిపుచ్చుకోవడానికే.. రేవంత్ రెడ్డి సర్కార్ పై నిత్యం అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు.ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది ఈ కల్వకుంట్ల కుటుంబం మన్నారు.ఇకనైనా BRS పేరు మీద కేటీఆర్, హరీష్ రావు.. TRS పేరుతో కవితలు ఆడుతున్న రాజకీయ డ్రామాలను ఆపాలని ఇందిరా శోభన్ హితవు పలికారు

Related News

Select the Topic
Scroll to Top