ఈతరం భారతం తిరుపతి/గరుడ ధాత్రి/ జూలై 10:
ఎస్ఐఆర్ ప్రక్రియ లో డిజిటలైజేషన్ పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు ఆదేశించారు. ఎస్ఐఆర్ కార్యక్రమం లో భాగంగా శుక్రవారం తిరుపతి పట్టణంలో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ విధానం ను జాయింట్ కలెక్టరేట్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తిరుపతి పట్టణం పోస్టల్ కాలనీ, కెన్నెడీ నగర్, బైరాగిపట్టెడ, దొడ్డాపురం వీధి పరిధిలోని పోలింగ్ స్టేషన్ ల వారీగా ఉన్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి బి ఎల్ ఓ లకు, సూపర్వైజర్ లకు దిశా నిర్దేశం చేశారు. ఏ ఎస్ డి లిస్ట్ తయారీ, ఆన్ లైన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.















