ఈతరం భారతం రంగా రెడ్డి జులై 11;
మీర్ పెట్ లోని నందనవనం కాలనీలో జనహిత సేవా ట్రస్ట్ హేయిల్ టాటా మణి చారిటబుల్ ట్రస్ట్ కిమ్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.జనహిత సేవా ట్రస్ట్ నరసింహమూర్తి మరియు జనహిత ట్రస్ట్ సభ్యులు శ్రీధర్ , హేయిల్ టాటా మణి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఫౌండర్ డాక్టర్ కాకుమాను లూర్దుజ్యోతి లు ఈ వైడీస్ శిబిరాన్ని ప్రారంభించారు. వైద్య శిబిరంలో జనరల్ ఫిజీషియన్ గైనకాలజిస్ట్ ఆర్థోపెటిక్ డాక్టర్లు బస్తీలోని ప్రజలకు 150 మందికి బీపీ షుగర్ పరీక్షించి వైద్య సలహాలు ఇచ్చి ఉచితముగా మందులు అందజేశారు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ ఎం శ్రీనివాస్ ఒళ్ళు నొప్పులు మోకాళ్ల నొప్పులు నడుము నొప్పుల సమస్యతో బాధపడుతున్న వారికి వ్యాయామాలు చేసి చూపించారు వైద్య శిబిరంలో డాక్టర్ కాకుమాను లూర్దు జ్యోతి, షరీఫ్ ఉన్నిసా, ఇఫ్తాకార్, బాణాల ప్రేమలత ఎస్.కె ప్రవీణ్ మెడికల్ క్యాంపు స్పాన్సర్స్, పోలంకి జగదీష్ కుమార్, పోలంకి ఉషారాణి ఎం సావిత్రి, రాజు ఫిలిం ఆర్టిస్ట్ గగన్ రవి, చారిటీ మెంబర్స్ సారధ్యంలో కిరణ్మయి, ధనలక్ష్మి ప్రశాంతి, కాలనీ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి మరియు కిమ్స్ కోఆర్డినేటర్ విక్రమ్ పాల్గొన్నారు















