ఈతరం భారతం సంగా రెడ్డి జులై 23 ;
నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పిసిసి ఉపాధ్యక్షులు జగ్గా రెడ్డి డిమాండ్ చేశారు.ఢిల్లీ లో విద్యార్థులపై పోలీసుల లాటి ఛార్జీని నిరసిస్తూ నల్ల దుస్తులు ధరించి సంగా రెడ్డి లో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా జగ్గా రెడ్డి మాట్లాడుతూ
ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు.. రాహుల్ గాంధీ కి మద్దతుగా రోజుకో రీతిలో సంగారెడ్డి లో నిరసన చేపడుతామని హెచ్చరించారు.బీజేపీ నేతల పిల్లలెవరూ నీట్ ఎగ్జామ్ రాయలేదేమో… అందుకే పేపర్ లీకేజీ వల్ల నష్ట పోయిన విద్యార్థుల బాధ వారికి తెలియడం లేదని జగ్గా రెడ్డి అన్నారు.పేపర్ లీకేజీ వల్ల కలిగిన నష్టం ఎంటో నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల తల్లిదండ్రులను అడిగితే తెలుస్తుందన్నారు.
సంగారెడ్డిలో రెండు సార్లు నీట్ ఎగ్జామ్ రాసిన ఓ స్టూడెంట్ కి మొదటిసారి 444 మార్కులు వస్తే రెండో సారి రాస్తే 386 మార్కులు వచ్చాయిరెండో సారి వచ్చిన ఫలితాలతో ఆ అమ్మాయి నీట్ కి క్వాలిఫై కాలేదుదీనికి బాధ్యత ఎవరు వహిస్తారో ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని జగ్గా రెడ్డి డిమాండ్ చేశారు.రాహుల్ గాంధీ డిమాండ్ చేసినట్లు ప్రధాని మోడీ దేశం లోని విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని జగ్గా రెడ్డి డిమాండ్ చేశారు.















