EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరణి 

ఈతరం భారతం తిరుపతి, జూలై 29 రిపోర్టర్ మనోజ్ కుమార్

తిరుపతి నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, భద్రత కోసం స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌ కింద 2.5 కోట్లతో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను బుధవారం ఉదయంb ఎం.ఎస్. సుబ్బలక్ష్మి కూడలిలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. దీనితో నగరంలోని 11 ప్రధాన సర్కిల్స్ లో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చాయి. నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు నూతన ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. వాహనదారులు ముఖ్యంగా టూ వీలర్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ కు అనుగుణంగా నడుచుకోవాలని ఆయన కోరారు. అలాగే ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు సిగ్నల్స్ పాటించి ఎటువంటి అప్పాయాలు జరగకుండా సహకరించాలని ఆయన కోరారు. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సిగ్నలింగ్ వ్యవస్థ కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం కావడం వల్ల ఆటోమేటిక్ గా సిగ్నల్ జంప్ అయితే బిల్లులు పడతాయని ఆయన గుర్తు చేశారు. కావున ప్రతి ఒక్కరూ సిగ్నలింగ్ వ్యవస్థను అనుసరించాలని మరొక్కసారి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు కొండయ్య, భక్తవత్సలం, కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ అమరయ్య, ఎస్ ఈ శ్యాంసుందర్, స్మార్ట్ సిటీ ఈ.ఈ. రవి, మునిసిపల్ ఇంజినీర్లు తులసి, గోమతి, గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్ పర్సన్ సుగుణమ్మ, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, మాజీ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top