ఈతరం భారతం తిరుపతి జులై 31 :రిపోర్టర్ మనోజ్ కుమార్
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఎపిడబ్ల్యూజెఎఫ్), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (ఎపిబిజెఎ) సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టుల వివిధ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కు వినతిపత్రం అందజేశారు.రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు శుక్రవారం డిమాండ్స్ డే సంధర్భంగాఎపిడబ్ల్యూజెఎఫ్,ఎపిబిజెఎఫ్, జర్నలిస్ట్ సంఘాల నాయకులు కలెక్టర్‌ను కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్నిసమర్పించారు.కలెక్టర్ కిజర్నలిస్టుల ప్రధాన డిమాండ్లు అయిన జిల్లాలోని జర్నలిస్టులందరికీ ఒక్కొక్కరికి మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇళ్లు కట్టుకోవడానికి తగిన ఆర్థిక సహాయం అందించాలికోరారు.
జర్నలిస్టుల ఉద్యోగ భద్రత, పని పరిస్థితులు,ఇతర సదుపాయాలపై అధ్యయనం చేసేందుకు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో ‘మీడియా కమిషన్’ ఏర్పాటు చేయాలనికోరారు.దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే మనరాష్ట్రంలోనూ జర్నలిస్టులకు పెన్షన్ పథకాన్ని అమలుచేసేందుకు ఒకకమిటీని నియమించాలని కోరారు.ఆగిపోయిన ‘ఆంధ్రప్రదేశ్’ మాసపత్రిక ప్రచురణను తిరిగి పునరుద్ధరించాలి.రాష్ట్రంలో ఏర్పాటైన 28 జిల్లాలకు అనుగుణంగా సమాచార శాఖను పటిష్టం చేసి, తగిన సిబ్బందిని నియమించడంతో పాటు కార్యాలయాలను ఆధునికీకరించాలిని కోరారు. రాష్ట్రంలోని జర్నలిస్టులందరూ రాయితీపై ఏసీ బస్సుల్లో ప్రయాణించేందుకు అనుమతించేలా ఉత్తర్వులు జారీ చేయాలనికోరారు.వర్కింగ్ జర్నలిస్టు వెల్ఫేర్ ఫండ్ కమిటీని పునరుద్ధరించి, ఈ ఫండ్‌కు రూ. 50 కోట్లు కేటాయించాలని కోరారు. సి. రాఘవాచారి మీడియా అకాడమీ పనితీరు పారదర్శకంగా ఉండేందుకు వెంటనే గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటుచేయాలనికోరారు. కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిన ప్రముఖుల పేరిట ఇచ్చే జర్నలిస్టు అవార్డుల ప్రదానాన్నిపునరుద్ధరించాలనికోరారు అసంఘటిత రంగ కార్మికులకు వర్తింపజేస్తున్న బీమా పథకాన్ని జర్నలిస్టులకూ వర్తింపజేయాలని కార్మిక శాఖ కమిషనర్ పంపిన ప్రతిపాదనలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనికోరారు.వృద్ధ జర్నలిస్టుల సంక్షేమం సామాజిక భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర కేంద్రంలో ప్రత్యేకంగా వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలి.
ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ వినతిపత్రంలో పేర్కొన్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని జర్నలిస్ట్ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు.కలెక్టర్ స్పందిస్తూ తన పరిదిలోని సమస్యలను పరిష్కరిస్తానని,మిగిలిన సమస్యలను ప్రభుత్వానికి పరిష్కారం కోసం పంపుతానన్నారు.అదేవిధంగా జర్నలిస్టులు హెల్త్ స్కీమ్ కోసం జర్నలిస్టులు చెల్లించే 1250 రూపాయలను జిల్లాలో అక్రిడిడేషన్ కలిగి జర్నలిస్టులందరికి సిఎస్ఆర్ పండ్ నుంచి 1250 చెల్లించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ను కోరగా, సానుకూలంగా స్పందించారు. ఈకార్యక్రమంలో ఎపిడబ్ల్యూజెఎఫ్ జిల్లా అధ్యక్షులుజి.చెంగల్రాయులు (గాంధి)ఎపిబిజెఎఫ్ జిల్లా అధ్యక్షులు కిరణ్, ఎపిడబ్ల్యూజెఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి,జిల్లా ఉపాధ్యక్షులు పానేటి చెంగల్రాయులు యాదవ్,జిల్లా సహాయ కార్యదర్శి గుండ్రాజు సుకుమార్ రాజు, కోశాధికారి కె.శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్టు సిబి మోహన్ రావు,యూనియన్ నాయకులు, సుధీర్,మణి,క్రిష్ణమూర్తి,వర్మ,వినోద్,రాధాదేవి,పి.యాసిన్, తదితరులు పాల్గొన్నారు.















