EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

అంబేద్కర్ జాతీయవాద భావజాలంపై ఏబీవీపీ నిజాం కళాశాల యూనిట్ ఆధ్వర్యంలో ఘనంగా సదస్సు

ఈతరం భారతం హైద్రాబాద్ జులై 31 :

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నిజాం కళాశాల యూనిట్ ఆధ్వర్యంలో “డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు ఆయన జాతీయవాద భావజాలం” అనే అంశంపై కళాశాల ఆడిటోరియంలో ఘనంగా సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు డా. రావుల కృష్ణ హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో డా. రావుల కృష్ణ మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు కేవలం రాజ్యాంగ రచనకే పరిమితం కాకుండా, సమానత్వం, సామాజిక న్యాయం, జాతీయ సమైక్యతకు మార్గదర్శకాలని తెలిపారు.

ఆయన మాట్లాడుతూ, “దేశభక్తి అంటే కేవలం జాతీయ గీతం పాడటం, జెండా ఎగురవేయడం మాత్రమే కాదు. దేశం కోసం ఆలోచించడం, దేశం కోసం పని చేయడం, దేశం కోసం బాధ్యతగా నిలబడడమే నిజమైన దేశభక్తి” అని పేర్కొన్నారు.

అదేవిధంగా, “జాతీయవాదమే సామాజిక న్యాయం – అదే అంబేద్కర్ ఆశయం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వమే నిజమైన జాతీయతకు పునాది” అని ఆయన విద్యార్థులకు వివరించారు. యువత దేశ నిర్మాణంలో చైతన్యవంతమైన పాత్ర పోషించాలని, అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టి బలమైన, సమైక్య భారత నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సదస్సులో ఏబీవీపీ గోల్కొండ జిల్లా కన్వీనర్ విక్రమ్ ఆదిత్య,బషీర్బాగ్ నగర కార్యదర్శి సురేందర్,రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మమత,కళాశాల అధ్యక్షులు అంజన్,కళాశాల కార్యదర్శి విష్ణు,రేవతి , సుప్రజ్,సంపత్,రఘునందన్, రాహుల్,మనోజ్,రాంప్రసాద్, శివ,మహేష్,నితిన్, మాన్సింగ్,జరీనా, వైష్ణవి ఇతర కార్యకర్తలు అధ్యాపకులు మరియు పెద్ద సంఖ్యలో నిజాం కళాశాల విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Related News

Select the Topic
Scroll to Top