ఈతరం భారతం డిచ్ పల్లి ఆగస్ట్ 1
కంకర రాళ్లకు బంగారం పూత పూసి మోసం…బాకీ తీర్చాలని కోరగా.. కంకర రాళ్లకు బంగారం పూత పూసి ఇచ్చిన ఘటన.నిజామాబాద్ నగరంలోని హమాల్వాడీకి చెందిన రమేష్ వద్ద రూ.1.30 లక్షల అప్పు తీసుకున్న శ్రీనివాస్.అప్పు తీర్చాలని శ్రీనివాస్ పై ఒత్తిడి తెచ్చిన రమేష్ తనకు గుప్తనిధులు దొరికాయని, అందులో బంగారం రాళ్లు ఉన్నాయని చెప్పిన శ్రీనివాస్.బంగారు రాళ్లను అప్పు కింద పట్టుకోమని రమేష్ ను నమ్మించిన శ్రీనివాస్.నిజామాబాద్‌లో కాకుండా డిచ్‌పల్లి మండలం ఘన్ పూర్ కి అదనంగా రూ.32 వేలు తీసుకొని రావాలని రమేష్ కు సూచించిన శ్రీనివాస్.నాలుగు కుండల్లో నాలుగు బంగారం రాళ్లను రమేష్ కు అందించిన శ్రీనివాస్.అనుమానం వచ్చి చూడగా.. కంకర రాళ్లకు బంగారం రంగు పూత పూసినట్లు గుర్తించి బాధితుడు రమేష్ మోసపోయానని గ్రహించి డిచ్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన రమేష్.














