ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్ట్ 8
తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జిల్లాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఆగస్టు 15న సంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏకకాలంలో కార్డుల పంపిణీ ప్రారంభం కావాలని మంత్రి స్పష్టం చేశారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.















