ఈతరం భారతం న్యూఢిల్లీ ఆగస్ట్ 8
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ దేశం కోసం ఏమీ చేయలేదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో వారు ఎలాంటి సేవ చేయలేదని స్పష్టం చేశారు.దేశ స్వాతంత్య్రం కోసం ఏ ఆర్ఎస్ఎస్ సభ్యుడైనా జైలుకు వెళ్లారా.. అని ప్రశ్నించారు. ఏ బీజేపీ కార్యకర్త అయినా జైలుకు వెళ్లారా అని ప్రశ్నించారు. ఒకవేళ ఎవరైనా వెళ్లి ఉంటే, వారు మొదట కాంగ్రెస్‌లో ఉండి తర్వాత ఆ వైపు వెళ్లినవారే అయి ఉంటారని అన్నారు. కానీ అసలైన బీజేపీ సభ్యుడు ఎవరూ ఆ ఉద్యమంలో పాల్గొనలేదన్నారు. ఇదే వారి చరిత్ర… అయినప్పటికీ దేశభక్తి గురించి మాకు ఎప్పుడూ బోధిస్తుంటారని ఎద్దేవా చేశారు.నిజానికి తామే నిజమైన దేశభక్తులం అని, వారు దేశభక్తిని వదిలేసినవారని చెప్పారు. బీజేపీ వాళ్లు బ్రిటిష్ వారి బానిసలు అని మండిపడ్డారు. వారికి బానిసల్లా బతికారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకులు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారని, అందుకే కాంగ్రెస్ ఎవరికి భయపడదని, ఎవరూ కాంగ్రెస్‌ను భయపెట్టలేరని ఖర్గే వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు పాదయాత్రం చేశారని.. దేశాన్ని కాపాడేందుకే ఆయన ఈ పాదయాత్ర చేశారని చెప్పారు. రాహుల్ గాంధీ లాంటి ఒక్కనాయకుడిని అయినా కాంగ్రెస్ లో చూపించాలని సవాల్ చేశారు.















