EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం సరికాదు  ఇది సమాజాన్ని చీలిస్తుంది: జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్.కృష్ణయ్య హెచ్చరిక

ఈతరం భారతం హైద్రాబాద్ ఆగస్ట్ 22; శనివారం:

రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం సరికాదని,ఇది సమాజాన్ని చీలిస్తుందనిజాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు.ఇకముందు రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం కొనసాగిస్తే ప్రతి ఘటన ఉద్యమాలు తప్పదని హెచ్చరించారు.శనివారం బిసి భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద అగ్రవర్ణాలవారు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం అన్యాయం – దుర్మార్గం. ఈ ఉద్యమాల ఆటలు కొనసాగునివ్వం. మానుకోకపోతే ప్రతి ఘటన ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నామన్నారుఈ దేశంలో 90 శాతం ఉన్న బీసీ/ ఎస్సీ/ ఎస్టీలను కొన్ని వందల సంవత్సరాలు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో అణిచి వేశారు. స్వతంత్రం తర్వాత రిజర్వేషన్లు పెట్టిన తర్వాత ఇప్పుడిప్పుడే ఈ కులాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఈ కులాలు అభివృద్ధి చెందుతుంటే అగ్రకులాలు ఓర్వలేక రిజర్వేషన్లపైఈర్ష అసూయలతో రగిలిపోతున్నారు.సమ సమాజం – సామాజిక న్యాయం కోసం రిజర్వేషన్లు పెట్టారు. రిజర్వేషన్లు పెట్టిన తర్వాత కొంత ప్రగతి ప్రారంభమైంది. బీసీలకు కేంద్రంలో రిజర్వేషన్లపై 34 సంవత్సరాలు నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీల శాతం 19 శాతం దాటలేదు. దేశ జనాభాలలో 56 శాతం జనాభా ఉన్న బీసీలకు 19 శాతం దాటలేదంటే ఇంకా అన్యాయం జరుగుతూనే ఉంది. కేంద్రంలో 100 సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటే బీసీలు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. అలాగే సీనియర్ గ్రేడ్ 1 అధికారులలో బీసీల శాతం మూడు శాతం దాటలేదు. అలాగే బ్యాంకు డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు ప్రభుత్వ రంగ సంస్థలలో ఉన్నత స్థాయి అధికారులు బీసీలకు శాతం ఇప్పటికే ఒక శాతం దాటలేదు. ఇప్పటి ఈ దేశం బీసీలకు అన్ని రంగాలలో అన్యాయం జరుగుతుంది.

ఇది ప్రజాస్వామ్య దేశం. పైగా ఈ సమాజం కుల పునాదులపై నిర్మించబడింది. భారతీయ సమాజంలో ఆర్థిక – సామాజిక అసమాతలకు కులం – కుల వృత్తిలే కారణం. ఈ అసమానతలు తొలగాలంటే రిజర్వేషన్లు కొనసాగించక తప్పదన్నారు.పైగా ఈ దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగం, పేదరికం, కుల వివక్ష, అవినీతి వీటిపై పోరాటాలు చేయకుండా యువతలో ఉన్న పోరాట పటిమను – స్ఫూర్తిని దారి మళ్లించి యువతతో ఉద్రేకాలు రెచ్చగొట్టడం సరికాదు.ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో భారత దేశం అగ్ర దేశం వైపు ప్రగతిస్తుంది -. పరుగులు తీస్తుంది. ఇలా అంటే సరైన కాలంలో సమాజాన్ని చీల్చి ప్రయత్నాలు కుట్రలు చేయడం సరికాదు. దేశాన్ని బలహీన పరచడం సరికాదు.

రిజర్వేషన్ వ్యతిరేకులు – ఉద్యమాలు ఆపండని హితవు పలికారు.అగ్రకుల సోదరులు బీసీ/ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తే ప్రతి ఘటన ఉద్యమాలు అంతకంటే భారీ ఎత్తున చేస్తాము. గతంలో మన రాష్ట్రంలో వచ్చిన 1986 ఉద్యమం, 1990లో వచ్చిన మండల కమిషన్ ఉద్యమం సందర్భంగా అగ్రకులాలు రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం చేశాయని అప్పుడు బి.సి.లు యూనివర్సిటీలను ఖాళీ చేయించి తరిమి – తరిమి కొట్టి పంపాము. ఇప్పుడు కూడా అదే పునారావృతం అవుతుందని హెచ్చరిస్తున్నామన్నారు.ఈ సమావేశం లో చేరుకుల రాజేందర్,ఆనంతయ్య.బాకీ రవి.బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top