ఈతరం భారతం తిరుపతి ఆగస్టు 22 రిపోర్టర్ మనోజ్ కుమార్
నగరంలోని హోటల్స్ నందు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అందించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ హెచ్చరించారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.జయకృష్ణ ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు శనివారం నగరంలోని పలు హోటల్స్ లో హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా కపిల తీర్థం వద్దగల A 2B హోటల్ ను తనిఖీ చేశారు. అందులో సరైన పారిశుధ్య నిర్వహణ లేకపోవడం, వారి హోటల్ లోని కాలువల్లో విచ్చలవిడిగా వ్యర్థాలను వేయడం వలన వెస్ట్ వాటర్ ప్రవాహనికి ఆటంకం కల్గి దుర్వాసన రావడం, హోటల్ నుండి వచ్చే వ్యర్థాల వలన మునిసిపల్ డ్రైనేజీ బ్లాక్ అవడం మరియు ఆహరపదార్దాలు నిలువవుంచే ప్రిజ్ తుప్పు పట్టి ఉండడం గమనించి మునిసిపల్ కార్పొరేషన్ చట్టం 1955 ను అనుసరించి వారి పై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.















