EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

బేగం బజార్ మర్వాడి మంచ్ లో ఉచిత బ్లడ్ గ్రూపింగ్ క్యాంప్

ఈతరం భారతం  హైదరాబాద్ఆగస్ట్22 ;

ది డెక్కన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో మార్వాడీ మంచ్ బేగం బజార్ లో నేడు ఉచిత బ్లడ్ గ్రూపింగ్ క్యాంప్ నిర్వహించారు.ఈ శిబిరంలో ఆర్గనైజషన్ వారికీ ఉచితంగా రక్త గ్రూపింగ్ పరీక్షలు 50 మందికి నిర్వహించి, వారి రక్త గ్రూపులను తెలియజేశారు. అత్యవసర పరిస్థితుల్లో రక్త గ్రూప్ సమాచారం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారికి అవగాహన కల్పించారు.ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు, భవిష్యత్తులో అవసరమైన సమయంలో రక్త గ్రూప్ సమాచారం సులభంగా అందుబాటులో ఉండేలా ప్రతి ఒక్కరికి తన రక్త గ్రూప్‌ను తెలుసుకోవడం అవసరమని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్వాడీ మంచ్ యాజమాన్యం, , సొసైటీ సభ్యులు, వైద్య సిబ్బంది మరియు వాలంటీర్లు పాల్గొని క్యాంప్‌ను విజయవంతం చేశారు.ది డెక్కన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆరోగ్య అవగాహనలో భాగంగా ఇలాంటి ఉచిత బ్లడ్ గ్రూపింగ్ క్యాంపులు, వైద్య శిబిరాలు మరియు ఇతర సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తోన్నట్లు డెక్కన్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఎక్సగ్యుటీ డైరెక్టర్ జి.మాధవి తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top