ఈతరం భారతంహైద్రాబాద్ సెప్టెంబర్ 2: బుధవారం
_________________________________________
కాంగ్రెస్ గూండాలు మా నల్గొండ జిల్లా అధ్యక్షుడి ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేయడాన్నిబిజెపి మీడియా ప్యానలిస్ట్ డాక్టర్ ప్రభ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఆయనకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లకుండా నన్ను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయడం దుర్మార్గమని ఆమె పేర్కొన్నారు.ఆయనను కలిసి నా మద్దతు తెలియజేయాలన్న నా ప్రయత్నాన్ని అడ్డుకుంది.
ప్రజాస్వామ్య స్ఫూర్తిని, రాజ్యాంగ విలువలను పూర్తిగా విస్మరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఈ చర్య స్పష్టం చేస్తోంది.కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ప్రభ గౌడ్ విమర్శించారు.దాడి చేసిన వారిని వదిలేసి, పరామర్శకు వెళ్తున్న వారిని అడ్డుకుంటారా అని ప్రశ్నించారు.బాధితులకు సంఘీభావం తెలపడం కూడా నేరమా? అని ప్రశ్నించారు.రాష్ట్రంలో కాంగ్రెస్ గూండాయిజం పెచ్చుమీరిపోతోందని దుయ్యబట్టారు.కాంగ్రెస్ సర్కార్ అప్రజాస్వామిక, నిర్బంధ విధానాలను అవలంబిస్తోంది.కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు పాల్పడుతుంటే, బాధితుల ఇళ్లకు వెళ్లకుండా ముందస్తు అరెస్టులు చేయడం హేయమైన చర్య.రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి, హోం శాఖ వైఫల్యం చెందిందన్నారు.














