ఈతరం భారతం ఓవర్సీస్ న్యూస్ సెప్టెంబర్ 1 మంగళవారం
______________________________________________
ఖాట్మండూ : నేపాల్లో సంభవించిన విధ్వంసకర ఆకస్మిక వరదలకు భారత్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేగంగా స్పందించిన తీరును నేపాల్ ఏకైక బిలియనీర్ బినోద్ చౌదరి మంగళవారం ప్రశంసించారు. ఆయన తమ దేశానికి ఆపన్నహస్తం అందించారని కొనియాడారు. విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని దానికంటే భారీగా ఉందని పేర్కొన్నారు.వరదల కారణంగా గ్రామాలు, మార్కెట్లు, పాఠశాలలు, వంతెనలు కొట్టుకుపోయాయని, 500 మెగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం నిలిచిపోయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో దేశ పునర్నిర్మాణం సవాల్గా మారిందన్నారు. 500 మెగావాట్లకు పైగా విద్యుత్ కేంద్రాలు పనిచేయకుండా పోయాయి. నిర్మాణంలో ఉన్న అనేక ప్రాజెక్టులు, ముఖ్యంగా విద్యుత్ ప్రాజెక్టులు, పనులు నిలిపివేయాల్సి వచ్చింది. కొన్ని ప్రాజెక్టులు వరదల్లో కొట్టుకుపోగా, మరికొన్ని తీవ్రంగా దెబ్బతిన్నాయి. పరిస్థితి నిజంగా అత్యంత బాధాకరంగా ఉంది అని చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు.















