EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

అయోధ్య రామమందిరం తొలి సీఈఓగా.. ‘ఆపరేషన్ సింధూర్’ అధికారి జితేంద్ర మిశ్రా

ఈతరం భారతం న్యూఢిల్లీ సెప్టెంబర్ 2 బుధవారం:

_______________________________________

అయోధ్య రామమందిర విరాళాల చోరీ, నిధులు గోల్‌మాల్ ఆరోపణలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆలయ నిర్వహణ పారదర్శకంగా జరిగేలా పటిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఇందుకోసం మొదటిసారి సీఈఓను నియమిస్తోంది. ఈ పదవికి మాజీ ఎయిర్‌ మార్షల్‌ జితేంద్ర మిశ్రాను ట్రస్ట్ ఎంపిక చేసింది. మొత్తం 5,500లకుపైగా దరఖాస్తు రాగా.. అనేక వడపోతల అనంతరం 16 మందిని ఇంటర్వ్యూకు పిలిచారు

శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రామమందిర సీఈఓ పదవి కోసం వచ్చిన 5,585 దరఖాస్తులను వడపోసి, చివరకు జితేంద్ర మిశ్రా పేరును ఖరారు చేశారు. వైమానిక దళంలో మిశ్రా 39 ఏళ్ల పాటు సేవలదించారు. ట్రస్ట్ ఛైర్మన్ నృత్య గోపాల్‌దాస్ నివాసంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో సీఈఓ ఎంపిక కమిటీ తుది నివేదికను సమర్పించింది. ముగ్గురు పేర్లను ప్రతిపాదించగా.. చివరకు జితేంద్ర మిశ్రా సీఈఓగా ఖరారు చేశారు.

Related News

Select the Topic
Scroll to Top