ఈతరం భారతం హైద్రాబాద్ సెప్టెంబర్ 8: మంగళవారం
___________________________________________
కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలు అమలుపరుచాలి కోరుతూ బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్ ఆదేశాలతో బిఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మెట్టుగూడలోని అంబేత్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.బౌద్ధనగర్, సీతాఫల్ మండి, మెట్టుగూడా డివిజన్ల ఆద్వర్యం లోఅంబేత్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రం సమర్పించారు.ఈసందర్భంగా బీఆర్ఎస్ బౌద్దనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కంది శైలజ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసిందని, అమలు కాని హామీలను ఇచ్చి తప్పుదారిలో అధికారంలోకి వచ్చింద న్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాని ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో బిఆర్ ఎస్ పార్టీ బౌద్దనగసర్ డివిజన్ సీనియర్ నాయకురాలు బల్ల గీత, రేణుక,మానస, ఫరీదా బేగం,సుజాత,సుమలత,భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు















