ఈతరం భారతం న్యూఢిల్లీ సెప్టెంబర్ 19
_______________________________
ఫార్మసీల పై ‘CCTV’ కన్ను.. ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందుల విక్రయం! కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం — నోటిఫికేషన్ విడుదల.
సిసిటీవీ నిబంధనలు & లక్ష్యాలు:
3 నెలల రికార్డింగ్ భద్రత: ప్రతీ ఫార్మసీలో కస్టమర్లు, మందుల విక్రయాలు స్పష్టంగా కనిపించేలా CCTV కెమెరాలను అమర్చాలి. అంతేకాకుండా, ఆ రికార్డింగ్స్‌ను కనీసం 3 నెలల పాటూ భద్రపరచడం తప్పనిసరి.
ప్రిస్క్రిప్షన్ వెరిఫికేషన్: డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే మందులు ఇస్తున్నారా లేదా అని డ్రగ్ ఇన్స్‌పెక్టర్లు, అధికారులు ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తనిఖీ చేస్తారు.
సిరప్‌ల దుర్వినియోగానికి చెక్: పెద్దలకు ఉద్దేశించిన శక్తివంతమైన దగ్గు సిరప్‌లు , ఇతర యాంటీబయోటిక్స్, అలవాటుగా మారే నిద్ర మాత్రలను పిల్లలకు ఇవ్వకుండా, అక్రమంగా విక్రయించకుండా అడ్డుకోవడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.
నకిలీ విక్రయాలకు అడ్డుకట్ట: మత్తు పదార్థాలుగా ఉపయోగపడే మందులను షెడ్యూల్డ్ డ్రగ్స్ కింద విక్రయించకుండా పూర్తి స్థాయిలో పారదర్శకత తీసుకురానున్నారు.















