EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రాష్ట్రంలోని 14 లక్షల మంది విద్యార్ధుల స్కాలర్ షిప్ లు – ఫీజులు వెంటనే చెల్లించాలి విద్యానగర్ నుంచి వేలాదిమంది విద్యార్ధులతో భారీ ప్రదర్శన

ఈతరం భారతం హైద్రాబాద్ సెప్టెంబర్ 23:

————————————————-

రాష్ట్రంలో 14 లక్షల మంది కాలేజీ విద్యార్థుల స్కాలర్ షిప్లు, ఫీజుల బకాయిలు 8500కోట్లు వెంటనే విడుదల చేయాలని, ఈ స్కీము ఎత్తివేయాలనే కుట్రలు మానుకోవాలని, ఈ స్కీమును యధాతధంగా పాత పద్ధతిలోనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది విద్యార్థులు నేడు విద్యానగర్ నుంచి భారీ ప్రదర్శన జరిపారు. ఈ ప్రదర్శనకు బిసి సంక్షేమ సంఘం సంఘం జాతీయఅధ్యక్షులు,రాజ్య సభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ స్కీముకు బడ్జెట్ ఇవ్వకుండా ముఖ్యమంత్రి పేద కులాల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. ఫీజుల బకాయిలు ఇవ్వాలని శాంతియుతంగా ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు చదువుకుంటుంటే కూడా ఓర్వలేక పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్నారని పేద కులాలు చదువుకోకుండా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.

ఈ ఫీజుల బకాయిలు 8500 కోట్లు చెల్లించడం ముఖ్యమంత్రికి ఒకలెక్క కాదు. మూడున్నర సంవత్సరాలుగా విద్యార్ధులు పడుతున్న భాదలు చెప్పతరం కాదు. కోర్సు పూర్తి అయిన 6 లక్షల మందికి కాలేజి యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు. వీరికి ఉద్యోగాలు వచ్చిన చేరలేక – ఉన్నత విద్యకు పోలేక చాల ఇబ్బంది పడుతున్నారు. చదువుతున్న వారి ఫీజులు కట్టే వరకు కాలేజీలకు రానివ్వడంలేదు. ఫీజుల బకాయిలు చెల్లించక పోవడంతో విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ భారీ ప్రదర్శనలో రాష్ట్ర బి.సి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్, రాష్ట్ర బి.సి విద్యార్ధి సంఘం రాష్ట్ర కన్వీనర్ నిఖిల్ పటేల్, అధ్యక్షులు పగిళ్ళ సతీష్, బి.సి సంఘం రాష్ట్ర అధ్యక్షులు సి. రాజేందర్, నరేష్ గౌడ్, శివ కుమార్ యాదవ్, రమేష్, రాహుల్, సురేష్, రమణ, కె. వంశీ, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top