ఈతరం భారతం న్యూఢిల్లీ సెప్టెంబర్ 24
_______________________________
ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకుల సమ్మె నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్ డబ్బులను రేపే (SEP 25) జమ చేసేందుకు అనుమతించింది. ఇది డిఫెన్స్, పోస్టల్, టెలికమ్యూనికేషన్ విభాగాలకూ వర్తిస్తుందని తెలిపింది. ఈ మొత్తాన్ని ‘అడ్వాన్స్ పేమెంట్’గా పరిగణిస్తారు. లెక్కలు ఖరారైన తర్వాత అక్టోబర్ చెల్లింపులో మిగతా డబ్బులను సర్దుబాటు చేస్తారు.















