ఈతరం భారతం న్యూఢిల్లీ సెప్టెంబర్ 26
________________________________
సెప్టెంబర్ 25వ తేదీ వరకు డ్రైవింగ్ లైసెన్స్ కు మొబైల్ నంబర్ లింక్ చేయకుంటే సస్పెండ్ చేస్తారనే ప్రచారంలో నిజం లేదని కేంద్రం స్పష్టం చేసింది. డిజిటల్ సేవల కోసం నంబర్ యాక్టివ్ గా ఉంచుకోవాలని సూచించింది. ఆర్టీఓ ఆఫీసుకు వెళ్లకుండానే ‘సారథి’ పోర్టల్ ద్వారా ఇంట్లోనే ఉచితంగా ఓటీపీతో మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోవచ్చని వెల్లడించింది.















