ఈతరం భారతం హైద్రాబాద్ అక్టోబర్ 7:
_______________________________
మద్యం తాగి వాహనం నడిపిన 35 మందిపై కేసులు నమోదు చేసిన కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు నాంపల్లి లోని ఎనిమిదవ జర్నలిస్టు మెన్ ఫర్ ఫస్ట్ క్లాస్ (VIII JMFC) కోర్టు లో హాజసరు పరిచారు.వీరిలో – మొదటిసారి: 2/వారానికి–19x 5,100 = 96,900/-,4/వారానికి–02x 10,100 = 20,200/-.
రెండవసారి: జరిమానా మరియు సామాజిక సేవ 2/వారానికి-5x 5,100= 25,500/-,పదేపదే మద్యం తాగి వాహనం నడిపిన నేరస్థులలో, కోర్టు జరిమానాలతో పాటు 2 రోజుల నుండి 10 రోజుల వరకు జైలు శిక్ష విధించింద- రెండవసారి: 6 మందికి 2 రోజుల జైలు మరియు జరిమానా.
మూడవసారి: 1 వ్యక్తికి 4 రోజుల జైలు మరియు జరిమానా.
4వ సారి: ఇద్దరికి 10 రోజుల జైలు శిక్ష మరియు జరిమానా.
విధించిన మొత్తం జరిమానా: ₹1,99,500/-విధించింది.
ఈ సందర్బంగా ఎస్.హెచ్.ఓ. కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఇన్స్పెక్టర్ బి.వి. కౌశీక్ మీడియాతో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించడానికి మరియు రోడ్డుపై ప్రయాణించే వారందరి ప్రాణాలను కాపాడటానికి, మద్యం సేవించిన తర్వాత వాహనాలు నడపడం/ప్రయాణించడం మానుకోవాలని మరియు ట్రాఫిక్ భద్రతా నియమాలను పాటించాలని వాహనదారులందరికీ విజ్ఞప్తి చేసారు.















