EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

విదేశీ విద్యార్థులకు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం భారీ షాక్ !

ఈతరం భారతం ఓవర్సీస్ న్యూస్ అక్టోబర్ 7:

__________________________________

విదేశీ విద్యార్థులకు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం భారీ షాక్ ఇచ్చింది. విదేశీ విద్యార్థులు కోర్సు పూర్తయ్యాక అక్కడే ఉంటూ ఉద్యోగం వెతుక్కోవడానికి వీలు కల్పించే ఆప్షనల్‌ ప్రాక్టీ స్‌ ట్రైనింగ్‌ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) ప్రోగ్రామ్‌కి సంబంధించి డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సంచలన ప్రతిపాదన ప్రకటించింది. దీని ప్రకారం ఓపీటీ ప్రోగ్రామ్‌లో చేరాలనుకునే F-1 విద్యార్థుల కోసం విశ్వవిద్యాలయాలే 70,000 డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే STEM (Extensions) సహా తదుపరి ప్రతి ఓపీటీకి 30,000 డాలర్లు అదనంగా చెల్లించాలి. ఈ రుసుమును అంతర్జాతీయ విద్యార్థులు కాకుండా సంబంధిత కళాశాలలు/ యూనివర్సిటీలే చెల్లించాల్సి ఉంటుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ స్పష్టం చేసింది.

ఈ ప్రతిపాదిత నిబంధనపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్టు తెలిపింది. అక్టోబర్ 8, 2026న ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురితమవుతుందని.. 30 రోజుల్లోగా ప్రజలు తమ అభిప్రాయాలు దీనిపై తెలియజేయాల్సి ఉంటుంది పేర్కొంది. ‘‘ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT)’’ అనేది అమెరికా వర్క్‌ఫోర్స్‌లోకి దొడ్డిదారిన ప్రవేశానికి, విదేశీ కార్మికులకు సబ్సిడీ ఇవ్వడానికి లేదా వ్యవస్థను దుర్వినియోగం చేసేవారికి ఇచ్చే బహుమతి కాకూడదు’’ అని డీహెచ్ఎస్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ‘‘విదేశీ విద్యార్థులు తమ సామర్థ్యాన్ని యజమానులకు నిరూపించుకునేలా DHS ఈ ప్రోగ్రామ్‌ను మార్చుతోంది.. చవకైన విదేశీ కార్మికుల సరఫరాకు దొడ్డిదారిగా మారిన ఈ ప్రోగ్రామ్‌తో అమెరికన్ కార్మికులు పోటీ పడాల్సిన అవసరం లేదు’’ అని ఆయన అన్నారు.

Related News

Select the Topic
Scroll to Top