ఈతరం భారతం ఓవర్సీస్ న్యూస్ అక్టోబర్ 7:
___________________________________
రష్యాలోని నల్ల సముద్రం తీరం సోచీ ప్రాంతంలో చమురు ట్యాంకర్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసింది. నౌకలో మంటలు చెలరేగాయి. లీకైన ముడి చమురు కొంత మేర సముద్రంలోనే మంటల్లో కాలుతోంది. ఆ సమయంలో నౌకలో 23 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. ట్యాంకర్‌కు సమీపంలోని సోచి ప్రాంతంలో భారీ నల్లటి పొగ ఎగిసిపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అఫ్రామాక్స్ రియో నౌకలో ఉన్న 23 మంది భారతీయ నావికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదనీ రష్యా అధికారులు తెలిపారు.
నౌకను ‘షాడో ఫ్లీట్ ‘ ఆంక్షల జాబితాలో చేర్చిన ఉక్రెయిన్ నౌకపై తాజాగా డ్రోన్ దాడి జరిపింది. రష్యా ఆంక్షల నుంచి తప్పించుకుని చమురు రవాణా చేయడానికి ఉపయోగించే నౌకలను ‘షాడో ఫ్లీట్ ‘గా పిలుస్తారు. ట్యాంకర్లో మంటలు చెలరేగడంతో సోచి బీచ్‌లను మూసివేశారు.నీరు, గాలి నాణ్యతను అధికారులు పరిశీలించారు. గాలిలో కాలుష్యం ప్రమాదకర స్థాయి కంటే తక్కువే ఉన్నట్లు సిరియస్ ఫెడరల్ అధికారి డిమిత్రి ప్లిష్కిన్ తెలిపారు. ప్రస్తుత దాడికి ఉక్రెయిన్ కారణమన్న ఆరోపణలను అధ్యక్షుడు జెలెన్స్కీ తోసిపుచ్చారు















