ఇద్దరం భారతం అక్టోబర్ 26 అమరావతి ఆంధ్ర ప్రదేశ్ :
రేపు మ.12 గంటల నుంచి ఏపీ బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను తీవ్రరూపం దాల్చనుందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. రేపు మ. 12 గంటల తర్వాత గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తేమతో కూడిన గాలులు బలంగా వీస్తుండటంతో తీవ్రత పెరిగే ఛాన్స్ ఉందని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, మన్యం, అల్లూరి, తూ.గో, కోనసీమ, కాకినాడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.















