EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రామగిరి ఖిల్లా ట్రెక్కింగ్ చేసిన వంశీకృష్ణ.. యువతకు సవాల్.. గెలిచిన వారికి వన్‌ప్లస్ ఫోన్ గిఫ్ట్!

ఈతరం భారతం మంథని ,పెద్దపల్లి తెలంగాణ అక్టోబర్ 26 :

_____________________________________________

చారిత్రక రామగిరి ఖిల్లాకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ  ప్రత్యేక చొరవ చూపుతున్నారు. రామగిరి ఖిల్లా అభివృద్ధి, పర్యాటక రంగం విస్తరణకు కృషి చేస్తున్న ఎంపీ.. సోమవారం రామగిరి ప్రాంతంలో సుమారు 10 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి, ఖిల్లా పూర్తి ప్రాంతాన్ని సందర్శించారు.

ఏడు గేట్లు దాటి, రెండు సరస్సులను అధిగమించి, నాలుగు గుట్టలను అధిరోహిస్తూ అత్యంత సాహసోపేతంగా ఖిల్లా పైభాగానికి చేరుకున్న ఎంపీ వంశీకృష్ణ  అక్కడి శివాలయం, శ్రీరామచంద్ర స్వామి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామగిరి ఖిల్లాలోని చారిత్రక కట్టడాలు, పురాతన ఆలయాలు, ప్రకృతి అందాలను స్వయంగా పరిశీలించారు.

రామగిరి ఖిల్లాకు రోప్‌వే.. పర్యాటక అభివృద్ధికి కొత్త దిశ!

రామగిరి ఖిల్లా పర్యాటక అభివృద్ధికి కీలకమైన రోప్‌వే ఏర్పాటుకు కేంద్ర స్థాయిలో కృషి చేసి నిధుల మంజూరుకు చొరవ తీసుకోవడం ద్వారా ఎంపీ గడ్డం వంశీకృష్ణ  ఈ ప్రాంత అభివృద్ధిపై తన నిబద్ధతను చాటుకున్నారు.రోప్‌వే అందుబాటులోకి వస్తే పర్యాటకులు ఖిల్లాను సందర్శించడం మరింత సులభతరం కానుంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పిల్లలు సైతం చారిత్రక ఖిల్లాను సులభంగా సందర్శించే అవకాశం కలుగుతుంది. దీంతో మంథని ప్రాంతానికి పర్యాటక రంగంలో ప్రత్యేక గుర్తింపు లభించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.

ట్రెక్కింగ్ చేసిన వంశీకృష్ణ.. యువతకు సవాల్.. విజేతకు వన్‌ప్లస్ ఫోన్ గిఫ్ట్!

రామగిరి ఖిల్లాలో సుమారు 10 కిలోమీటర్ల మేర సాహసోపేతంగా ట్రెక్కింగ్ చేసిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ  యువతకు స్ఫూర్తినిస్తూ ట్రెక్కింగ్ సవాల్ విసిరారు. యువతలో సాహస క్రీడలు, ఫిట్‌నెస్ పట్ల ఆసక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ సవాల్‌ను ముందుకు తీసుకువచ్చారు. ఈ సవాల్‌లో విజేతగా నిలిచిన వారికి వన్‌ప్లస్ ఫోన్‌ను బహుమతిగా అందించనున్నట్లు ప్రకటించారు.

చారిత్రక సంపదకు కొత్త వెలుగు.. పర్యాటక అభివృద్ధికి కొత్త దారి!

రామగిరి ఖిల్లా తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇక్కడి పురాతన ఆలయాలు, కోట నిర్మాణాలు, ప్రకృతి అందాలను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో ఎంపీ గడ్డం వంశీకృష్ణ  చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం.

రాములవారి దర్శనం నుంచి ఖిల్లా పైభాగంలోని శివాలయం, శ్రీరామచంద్ర ఆలయాల సందర్శన వరకు సాగిన ఎంపీ పర్యటన రామగిరి ప్రాంత అభివృద్ధిపై ఆయన చూపుతున్న ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనంగా నిలిచింది.రామగిరి ఖిల్లాకు ప్రపంచస్థాయి గుర్తింపు.. మంథని ప్రాంతానికి పర్యాటక వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ  ముందుకు సాగుతున్నారు.

Related News

Select the Topic
Scroll to Top