EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రాజేంద్రనగర్‌లో పలు ప్రాంతాల్లో భారీ శబ్దాలు…

ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 26 :

రాజేంద్రనగర్‌లో పలు ప్రాంతాల్లో భారీ శబ్దాలు కలకలం రేపాయి. ఎర్రబోర, ఉప్పరపల్లి, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌లో పేలుడు శబ్ధాలు వినిపించాయి.10 సెకన్ల పాటు భూమి కంపించింది. నాలుగు ప్రాంతాల్లో ఒక్కసారిగా పేలుడు శబ్దాలు రావడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. భూకంపమా..? ఇతర పేలుడు పదార్థాల కారణంగా వచ్చిన శబ్దమా? అంటూ స్థానికుల్లో చర్చ జరుగుతోంది. కాగా, ఈ ఏడాది ఫిబవ్రరిలో గాజుల రామారంలోని మెట్‌కానిగూడ పరిసర ప్రాంతాలలో భూమి కంపించిన సంగతి తెలిసిందే. మెట్‌కానిగూడ, హెచ్‌ఏఎల్, ఓక్షిత్‌ ఎన్‌క్లేవ్, ఆదర్శనగర్‌ కాలనీలలో ఒక్కసారిగా భారీ శబ్దంతో భూమి కంపించింది. భూమి కంపించడంతో స్థానిక పాఠశాలలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి.

Related News

Select the Topic
Scroll to Top