EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదాం : రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి

ఈతరంభారతంవికారాబాద్ అక్టోబర్ 28 :

________________________________

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును నాశనం చేస్తున్న డ్రగ్స్ మహమ్మారిని మన దేశం నుంచి తరిమి కొట్టాలని జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి అన్నారు విశ్వ భారతి డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి “నశా ముక్త భారత్ అభియాన్ “ర్యాలీని మరియు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి మాట్లాడుతూ ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకొని క్రమశిక్షణతో చదువుకుంటున్న విద్యార్థులను కొంతమంది దుష్టశక్తులు దురలవాట్లకు దగ్గరకు చేస్తున్నారని డ్రగ్స్, మధ్యము, సిగరెట్లకు బానిసలుగా చేస్తున్నారని అన్నారు. దీంతో ప్రతి విద్యార్థి విలువైన సమయాన్ని వృధా చేయటంతో పాటు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తల్లిదండ్రులు, గురువులు కన్నా కలలను నిజం చేసేందుకు నిరంతరం కష్టపడాలని పిలుపునిచ్చారు. సక్రమమైన మార్గాన్ని ఎంచుకొని లక్ష్యసాధనకు కృషి చేయాలన్నారు. విశ్వ భారతి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తమ జీవితాలను అందరికీ ఆదర్శంగా ఉండేలా మలచుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా సంపాదించాలన్నారు. కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు కావలసిన అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, కళాశాల విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top