ఈ తరం భారతం న్యూఢిల్లీ అక్టోబర్ 28:
_______________________________
ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ హౌస్ (ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ మార్కెటింగ్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్) డైరెక్టర్లుగా దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాల నుండి 18 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఈరోజు ఢిల్లీలో CEA, మినిస్ట్రీ ఆఫ్ కోపరేషన్, Govt of India ఫలితాలు ప్రకటించారు.ఈ సందర్భంగా తెలంగాణ నుండి కర్నాటి వజ్రమ్మ, మహారాష్ట్ర నుండి కాశీనాథ్ గడ్డం, ఆంధ్రప్రదేశ్ నుండి నక్క వెంకటేశ్వరరావు మరియు మరొకసారి ఏకగ్రీవంగా గెలిచిన ప్రస్తుత చైర్మన్ రాహుల్ పత్రికార్ లను ఢిల్లీలో చేనేత దినోత్సవ వ్యవస్థాపకులు యర్రమాద వెంకన్న నేత అభినందించారు. 70 సంవత్సరాల హ్యాండ్లూమ్ హౌస్ చరిత్రలో తెలంగాణ నుండి మొదటిసారి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఎన్నికైనారు. APCO మాజీ డైరెక్టర్ కర్నాటి వెంకటేశం, చౌటుప్పల్ చేనేత సహకార సంఘం మాజీ అధ్యక్షులు కందగట్ల బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.















