EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

అర్నాబ్‌ తుఫాన్‌ బీభత్సం : వరద ఉద్ధృతికి రెండు చోట్ల రహదారులు, వంతెనలు ధ్వంసం

ఈతరం భారతం అమరావతి అక్టోబర్ 28 :

అర్నాబ్‌ తుఫాన్‌ తీరం దాటకముందే భోగాపురం మండలంలోని పలు గ్రామాలను అతలాకుతలం చేసింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి బుధవారం ఉదయం వరకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. పలుచోట్ల చెట్లు విరిగి నేలకొరిగాయి. చెరువులు నిండిపోయి నీరు పొంగిపొర్లుతోంది. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో తాగునీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన కల్వర్ట్‌, వంతెన.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వైపు నుంచి భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో సవరవిల్లి నుంచి కౌలవాడ వెళ్లే మార్గంలో జమ్మయ్యపేట సమీపంలోని కల్వర్టు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. అదేవిధంగా సవరవిల్లి నుంచి రావాడ మీదుగా భీమిలి మండలంలోని అన్నవరం గ్రామానికి వెళ్లే రహదారిలో జీరు పేట సమీపంలోని వంతెన కూడా వరదనీటికి దెబ్బతింది.

ఈ రెండు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోవడంతో సుమారు 20 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించలేని పరిస్థితి ఏర్పడింది. అత్యవసర పనులపై వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. బుధవారం కూడా ఇదే విధంగా భారీ వర్షం కొనసాగితే మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దెబ్బతిన్న రహదారులు, వంతెనలకు మరమ్మతులు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించాలని, విద్యుత్తు సరఫరా, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

Related News

Select the Topic
Scroll to Top