EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

భాగ్య నగరం లో ప్యాడ్ టాక్సీ లు

ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 29:

__________________________________

హైదరాబాద్ సిటీలో మెట్రో రైలు దిగిఆఫీసులు, ఇండ్లకు వెళ్లడానికి ప్యాసింజర్లు పడుతున్న తిప్పలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కొత్తగా ‘పాడ్ టాక్సీ’లను తీసుకురావాలని చూస్తోంది. మెట్రో దిగిన ప్రయాణికులను సులువుగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ఈ దిశగా అడుగులు వేస్తోంది. పీపీపీ విధానంలో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(పీఆర్ టీఎస్) పేరుతో పాడ్ టాక్సీల ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తోంది.ఈ ప్రాజెక్టుపై అధ్యయనం చేసిన లీ అసోసియేట్స్ డైరెక్టర్ బీఎం సెట్టి ప్రజెంటేషన్ తో రూట్ల వివరాలను వివరించారు.మెట్రో, సిటీ బస్సులతో పోలిస్తే పాడ్ టాక్సీల వల్ల కలిగే లాభాలను ఆయన చూపించారు. నగరంలో ప్రస్తుతం రెండు ప్రధాన ప్రాంతాలను ఎంపిక చేసి అధ్యయనం చేసినట్లు వెల్లడించారు. ఇందులో మొదటి ప్రాంతం రాయదుర్గం నుంచి కూకట్పల్లి వరకు ఉన్న కారిడార్. ఇందులో రాయదుర్గం, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లతో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసర ప్రాంతాలు ఉన్నాయి. ఇక రెండో ప్రాంతం రాష్ట్ర సెక్రటేరియెట్, హుస్సేన్ సాగర్, బేగంపేట్, అసెంబ్లీ, సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాలు. ఈ మార్గాల్లో రోజుకు ఎంతమంది ప్రయాణించే అవకాశం ఉంది, పాడ్ టాక్సీల కోసం డిపోలను ఎక్కడెక్కడ కట్టాలి, రూట్ల నిర్మాణంలో రోడ్ల మీద ఎలాంటి సమస్యలు వస్తాయి అనే అంశాలను ఆయన వివరించారు.

Related News

Select the Topic
Scroll to Top