ఈతరం భారతం మేడ్చల్ అక్టోబర్ 29
_____________________________
తెలంగాణ మహిళా ఐక్యవేదిక కార్యాలయాన్ని మేడ్చల్ జిల్లా బాలాజీ నగర్ లోని ముత్తుస్వామి వికలాంగుల కాలనీలో గురువారం ప్రారంభించారు .ఈ సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షురాలు దండు లక్ష్మీ ముదిరాజ్ మాట్లాడుతూ రోజురోజుకు మహిళల పట్ల ఆగడాలు, అరాచకాలు, వేధింపులు పెరుగుతున్నాయని మహిళలకు రక్షణగా వారి సమస్యల పరిష్కారం కోసం తాము తెలంగాణ మహిళా ఐక్యవేదికను ప్రారంభించినట్లు తెలిపారు .మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తమ సంఘాన్ని సంప్రదించిన తో వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మంజుల జి .ఉపేంద్ర పి. లక్ష్మి , ది.విలీన, ఈ .యాదమ్మ మమత, నిర్మల, ఎల్లమ్మ, కరుణ, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు















