ఈతరం భారతం హైదరాబాద్:అక్టోబర్ 29
_________________________________
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 24వ విడత సహాయం కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఆసక్తి గా ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 24వ విడత డబ్బులు విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 30వ తేదీన గుజరాత్లోని బనాస్కంఠ జిల్లాలో జరిగే ప్రత్యేక జాతీయ స్థాయి కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ విడత ద్వారా దేశంలోని సుమారు 9.34 కోట్ల మందికి పైగా రైతు కుటుంబా ల బ్యాంకు ఖాతాల్లో కి రూ.18,680 కోట్లకు పైగా ఆర్థిక సహాయం నేరుగా జమ కానుంది.
ఈ పథకం కింద ప్రతి ఏడాది అర్హులైన రైతు కుటుంబాలకు కేంద్రం రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తోంది. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2,000 చొప్పున మూడు విడతల్లో ఈ డబ్బులు నేరుగా అందుతాయి. అయి తే రేపు శుక్రవారం మీ ఖాతాలో డబ్బులు పడతాయో లేదో తెలుసుకోవడానికి రైతులు ముందుగా అధికారిక వెబ్సైట్లో కి వెళ్లి చూసుకోవాలి.
పోర్టల్లోని నో యువర్ స్టేటస్ ఆప్షన్ ద్వారా మీ రిజిస్ట్రేషన్ నంబర్, ఓటీపీ నమోదు చేసి మీ అర్హతను సులభంగా చెక్ చేసుకోవచ్చు.















