ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 29
________________________________
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సభ్యులం. గత 9 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం, సంక్షేమం కోసం రాజ్యాంగబద్ధంగా పని చేస్తున్నాము.ఇట్టి విషయాన్ని గత మే నెలలో మీకు సమర్పించిన వినతి పత్రం. సమర్పించాము.ఈ విషయంలో మీ దృష్టికి కొన్ని అత్యంత ముఖ్యమైన అంశాలు తీసుకువస్తున్నాము.2026 జనవరిలో కొంతమంది వ్యక్తులు మా “తెలంగాణ ఉద్యమకారుల ఫోరం” పేరుతోనే మరో సంఘాన్ని రిజిస్టర్ చేసుకున్నారు.
ఆ నకిలీ సంఘం పేరుతో “అసెంబ్లీ ముట్టడి, సెక్రటేరియట్ ముట్టడి, కలెక్టరేట్ ముట్టడి, సీఎం ఇల్లు ముట్టడి” అంటూ ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పిలుపునిస్తున్నారు. వారుపిలుపునిస్తున్నందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా అసలైన మా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులను, నాయకురాండ్రను పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. దీనివల్ల మా సంఘ ప్రతిష్ట దెబ్బతింటుంది.అంతేకాకుండా కరీంనగర్ కేంద్రంగా “FIR కాపీలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు” అని దిశ పేపర్ లో కూడా వార్తలు వచ్చాయి. దీనిపై మే నెలలోనే మీకు లేఖ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది
కావున తమరిని కోరుతున్నది ఏమనగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పేరుతో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న వారికి, మరియు FIR ల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న వారికి మా అసలైన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (9yrs) కి ఎటువంటి సంబంధం లేదని మనవి చేస్తూ, వారిపై తక్షణమే విచారణ జరిపి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.















