ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 29:
________________________________
జర్నలిస్ట్ కుటుంబానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈనాడు జర్నలిస్ట్ దివంగత దత్తురెడ్డి భార్య ప్రియాంకకు న్యాక్‌లో అసిస్టెంట్ ఇన్‌స్ట్రక్టర్‌గా ఉద్యోగం.సంగారెడ్డిలో ఉద్యోగ అవకాశం కల్పించిన మంత్రి.. ఉద్యోగాన్ని పర్మినెంట్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు.ధన్యవాదాలు తెలిపిన ప్రియాంక కుటుంబ సభ్యులు…హర్షం వ్యక్తం చేసిన పలువురు జర్నలిస్టులు.
ఒక కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడటమే కాదు..మానవీయకోణంలో ఇచ్చిన మాట ప్రకారం భరోసాగా నిలిచే నిజమైన నాయకుడు రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి .అందులో భాగంగానే దివంగత ఈనాడు జర్నలిస్ట్ దత్తురెడ్డి కుటుంబానికి అండగా నిలిచి, గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చి మరోసారి తన మానవతా హృదయాన్ని చాటుకున్నారు.గతేడాది ఈనాడు జర్నలిస్ట్ దత్తురెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందడంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కామారెడ్డి జిల్లాలోని దత్తురెడ్డి స్వగ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ క్లిష్ట సమయంలో కుటుంబానికి ధైర్యం చెప్పడంతో పాటు, తక్షణ సాయంగా రూ.4 లక్షలు అందజేశారు.అంతటితో తన బాధ్యత ముగిసిందని భావించకుండా.. కుటుంబానికి భవిష్యత్తులోనూ అండగా ఉంటానని మంత్రి భరోసా ఇచ్చారు. దత్తురెడ్డి భార్య ప్రియాంకకు తన శాఖ పరిధిలో ఉద్యోగం కల్పిస్తానని నాడు హామీ ఇచ్చారు.ఇచ్చిన మాటకు కట్టుబడి, తాజాగా ప్రియాంకకు న్యాక్ (NAC)లో అసిస్టెంట్ ఇన్‌స్ట్రక్టర్‌గా సంగారెడ్డిలో ఉద్యోగ అవకాశం కల్పించారు. అంతేకాకుండా, ఆమె ఉద్యోగాన్ని పర్మినెంట్ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రియాంకకు భవిష్యత్తులోనూ అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
తమ కష్టకాలంలో అండగా నిలిచి, ఇచ్చిన హామీని నెరవేర్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ప్రియాంకతో పాటు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి కోమటి రెడ్డి చూపిన మానవత్వం, జర్నలిస్టు కుటుంబం పట్ల ఆయన తీసుకున్న చొరవపై పలువురు జర్నలిస్టులు సైతం ధన్యవాదాలు తెలిపారు. కష్టాల్లో ఉన్న జర్నలిస్ట్ కుటుంబానికి భరోసా కల్పిస్తూ, ఒక కుటుంబ భవిష్యత్తుకు అండగా నిలవడం అభినందనీయమని వారు హర్షం వ్యక్తం చేశారు.















