EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తుమ్మిడిహట్టి సాగునీటి లక్ష్యాలు నెరవేరాలి

ఈతరం భారత అక్టోబర్ 31 హైదరాబాద్:

తుమ్మిడిహట్టి సాగునీటి లక్ష్యాలు నెరవేరాలి.. మహారాష్ట్ర ఆందోళనలకు ఆచరణాత్మక పరిష్కారాలు చూపాలి! ముంపు, పర్యావరణ సమస్యలను అధిగమించేందుకు సాంకేతికంగా సమర్థమైన మార్గాలను అన్వేషించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అక్టోబర్‌ 26న ముంబయిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ జరిపిన చర్చలకు కొనసాగింపుగా.. అక్టోబర్‌ 31న శనివారం హైదరాబాద్‌లో తుమ్మిడిహట్టి బ్యారేజీ అలైన్‌మెంట్లు, సాంకేతిక అంశాలపై సమీక్ష నిర్వహించారు. వివిధ నీటిమట్టాల్లో ముంపు పరిధిని గుర్తిస్తూ సమగ్ర పటాలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ. శ్రీధర్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (జనరల్‌) ఓ.వి. రమేష్‌బాబు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top